తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెట్రిమారన్​ దర్శకత్వంలో దళపతి! - vetri maaran vijay movie

దర్శకుడు వెట్రి మారన్​-తమిళ స్టార్​ హీరో విజయ్​ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

vijay
విజయ్​

By

Published : Mar 29, 2021, 6:49 AM IST

'ఆడుగలం', 'అసురన్' చిత్రాలతో జాతీయ స్థాయిలో మెరిసిన దర్శకుడు వెట్రి మారన్. ఆయన తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ దళపతితో ఓ చిత్రం చేయనున్నారని ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ క్రేజ్ కలయికలోనే 'విజయ్ 65' పట్టాలెక్కుతుందని భావించినా ఆఖరి నిమిషంలో ఆ అవకాశం నెల్సన్ దిలీప్ కుమార్​కు దక్కింది.

దీంతో వెట్రి-విజయ్​ల కాంబినేషన్ లేనట్లే అనుకున్నారు. అయితే త్వరలోనే వీరిద్దరి కలయికలో ఓ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కథ సిద్ధమైంది. నిజానికి గతంలోనే ఈ కథ విజయ్​కు వినిపించారని, అది ఆయనకు నచ్చడం వల్ల 'విజయ్ 65'గా సెట్స్ పైకి తీసుకెళ్లా లని భావించారు. కానీ, వెట్రి మారన్ ముందుగా ఒప్పుకున్న సినిమాల వల్ల ఇది ఆలస్యమైంది.

ఇప్పుడా సినిమాలన్నీ పూర్తి చేసి, విజయ్ కోసం వేచి చూసేందుకు సిద్ధమవుతున్నారు వెట్రే మారన్. విజయ్ కూడా నెల్సన్ సినిమా పూర్తి చేసి, ఆయనతో చేతులు కలిపేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదిలోనే వీరి ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: దళపతి విజయ్​ ఇంటికి బాంబు బెదిరింపు

ABOUT THE AUTHOR

...view details