తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రెండు జడలతో ఈషా.. కొవిడ్‌కి జగపతి థ్యాంక్స్‌ - urvashi rautela vivek

సోషల్ మీడియా వేదికగా పులువురు సినీ తారలు విశేషాలు పంచుకున్నారు. యువ కథానాయిక ఈషా రెబ్బా చిన్న పిల్లలా రెండు జడలు వేసుకున్న ఫొటోను ఇన్​స్టాలో షేర్​ చేసుకుంది. ఇటీవల మరణించిన తమిళ హాస్య నటుడు వివేక్​ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ అతడితో ఉన్న ఫొటోను నటి ఊర్వశి రౌతేలా పంచుకున్నారు. కొవిడ్​కు ధన్యవాదాలు తెలిపారు నటుడు జగపతి బాబు.

urvashi rautela, jagapathi babu, esha rebba
ఊర్వశి రౌతేలా, జగపతి బాబు, ఈషా రెబ్బా

By

Published : Apr 18, 2021, 10:09 PM IST

  • రెండు జడలు వేసుకుని చిన్న పిల్లలా దర్శనమిచ్చింది యువ నాయిక ఈషా రెబ్బా.
  • దివంగత నటుడు వివేక్‌తో దిగిన ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా.
  • బరువు తగ్గించుకునే పనిలో పడ్డారు నటి, నిర్మాత చార్మి. ఇంట్లో చేసిన వ్యాయామాన్ని ఫొటో రూపంలో పంచుకున్నారామె.
  • 'వకీల్‌ సాబ్‌' చిత్రానికి సంబంధించిన ఆఖరి ప్రచారంలో పాల్గొన్నాను అంటూ ఆనందం వ్యక్తం చేసింది నివేదా థామస్‌. కొవిడ్‌ బారిన పడటం వల్ల గతంలో ప్రచారం చేయలేకపోయింది నివేదా.
  • హాస్యం, ఆశ్చర్యం, ఆలోచించడం.. ఇలా వివిధ రకాల పోజుల్లో సందడి చేస్తోంది రష్మిక.
  • తనకు తనే మేకప్‌ వేసుకుంటూ కనిపించారు నటుడు జగపతి బాబు. 'కొవిడ్‌కి ధన్యవాదాలు.. నేను మేకప్‌మెన్‌ అయ్యాను (నవ్వుతూ)' అని రాసుకొచ్చారు.

ఇదీ చదవండి:మరో ముగ్గురు నటులకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details