డ్రగ్స్ కేసులో(Drugs Case News) అరెస్టయిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్(Aryan Khan News) క్రమంగా జైలు వాతావరణానికి అలవాటుపడుతున్నాడు. 19 రోజుల నుంచి ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్న అతడు తొలుత ఎవరితోనూ మాట్లాడలేదు. ప్రస్తుతం అతడు ఇతర ఖైదీలతో మాట్లాడుతున్నట్లు తెలిసింది.
ఆర్యన్ ప్రస్తుతం జైలు నియమాలను పాటిస్తున్నాడని ఓ అధికారి పేర్కొన్నారు. జైలు పరిసరాల్లో రాత్రి 7 గంటలకు నిర్వహించే హారతి పూజకు ఆర్యన్ హాజరవుతున్నాడని తెలిపారు. చదువుకోవడానికి అతడు అధికారుల నుంచి మత గ్రంథాలు(Religious Books) అడిగాడని సమాచారం.
అయితే.. జైలు అధికారులు చెప్పినప్పటికీ ఆర్యన్ నాలుగు రోజుల వరకూ స్నానం చేయడం లేదని తొలుత వార్తలొచ్చాయి. సొంతింటి నుంచి రెండు బెడ్ షీట్లు, కొన్ని బట్టలు పంపించినా అతడు ఏదీ ఉపయోగించలేదని తెలిసింది. జైలు అధికారులు ప్రయత్నించినా అతడు ఎలాంటి ఆహారం తీసుకోలేదట. కాగా, జైలుకు వచ్చేటపుడు అతడు తనవెంట కొన్ని వాటర్స్ బాటిల్స్ తీసుకురాగా.. ప్రస్తుతం 3 మాత్రమే మిగిలున్నాయి జైలు అధికారుల్లో ఒకరు తెలిపారు.
ముంబయి శివారులోని క్రూజ్ నౌకలో డ్రగ్స్ కేసులో అక్టోబర్ 3న ఆర్యన్(aryan khan news) సహా ఏడుగురిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. అక్టోబర్ 7న ముంబయి ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసులో నిందితులకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం వారి జ్యుడిషియల్ రిమాండ్ గడువును పొడిగించింది.