తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డ్రగ్స్ కేసులో ఎన్​సీబీ విచారణకు ఆర్యన్​ఖాన్​ డుమ్మా - Cruise drugs case news

ముంబయి డ్రగ్స్ కేసు వ్యవహారంలో విచారణకు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ ఆదివారం(నవంబరు 7) హాజరుకాలేదు. జ్వరం కారణంగా హాజరు కాలేదని ఓ అధికారి తెలిపారు.

Aryan Khan
ఆర్యన్​ఖాన్​

By

Published : Nov 7, 2021, 10:45 PM IST

ముంబయి క్రూయిజ్ షిప్​ డ్రగ్స్ కేసులో భాగంగా విచారణకు బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు ఎన్​సీబీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) సమన్లు జారీ చేసింది. అయితే.. ​ ఆదివారం(నవంబరు 7) విచారణకు ఆర్యన్​ఖాన్​ హాజరు కాలేదు. జ్వరం కారణంగా ఆర్యన్​ హాజరు కాలేదని ఓ అధికారి తెలిపారు.

అక్టోబరు 3న క్రూయిజ్ ​షిప్​లో రేవ్​పార్టీ, డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్​ఖాన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి దాదాపు 22రోజులు జైలులోనే ఉన్నాడు. అతడి తరఫు న్యాయవాదులు పలుమార్లు ప్రయత్నించినప్పుటికీ, కోర్టు దానిని మంజూరు చేయలేదు.

ఆ తర్వాత అక్టోబరు 28న.. ఆర్యన్​తో పాటు మరో ఇద్దరికి 14షరతులతో కూడిన బెయిల్​ ​ మంజూరు చేసింది న్యాయస్థానం. ఆర్యన్​కు వ్యక్తిగత నటి జుహీచావ్లా పూచీకత్తు ఇచ్చింది.

ఇదీ చూడండి:ఆర్యన్​ ఖాన్​ విడుదలకు 14 షరతులు- ఆ పనులు చేయకూడదు!

ABOUT THE AUTHOR

...view details