తెలంగాణ

telangana

ETV Bharat / sitara

#ఆర్యఛాలెంజ్..​ అంతర్జాలంలో హల్​చల్..! - got

గేమ్​ ఆఫ్ థ్రోన్స్​ పోరాట సన్నివేశాన్ని పేరడీ చేస్తున్నారు నెటిజన్లు. ఆర్య ఛాలెంజ్​ పేరుతో చేస్తున్న ఈ వీడియోలు అంతర్జాలంలో వైరల్​ అవుతున్నాయి. వీటిపై చాలామంది ఔత్సాహికులు విశేషంగా స్పందిస్తున్నారు.

ఆర్య

By

Published : May 2, 2019, 6:08 PM IST

ట్రెండ్​కు తగ్గట్టు అంతర్జాలంలో ఎప్పుడూ ఏవో ఛాలెంజ్​లు, విన్యాసాలు చేస్తూనే ఉంటారు చాలా మంది ఔత్సాహికులు. మొన్నటి వరకు కికీ, ఐస్​ బకెట్ ఛాలెంజ్​ లాంటి వైవిధ్యాలను ప్రదర్శించారు. తాజాగా అమెరికన్ టీవీ సిరీస్​.. గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​ సన్నివేశాలకు పేరడీ చేస్తున్నారు. #ఆర్యఛాలెంజ్​ పేరుతో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

గేమ్​ ఆఫ్​ థ్రోన్స్ చివరి సీజన్​ తొలి ఎపిసోడ్ఏప్రిల్​ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు చివరి సీజన్​లోని మూడు ఎపిసోడ్లు అలరించాయి. గత వారం వచ్చిన మూడో ఎపిసోడ్​లో ఆర్య స్టార్క్​ చేసిన పోరాట సన్నివేశాన్ని పేరడీ చేస్తున్నారు నెటిజన్లు. ఆర్య ఛాలెంజ్ ​పేరుతో చేసే ఈ విన్యాసాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details