తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో 'ఆర్య' దంపతులకు పండంటి బిడ్డ - arya vishal

తమిళ హీరో ఆర్య-సాయేషా దంపతులకు తల్లిదండ్రులుగా ప్రమోషన్​ వచ్చింది. సాయేషాకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. 2019లో వీరిద్దరికీ వివాహమైంది.

Arya and Sayyeshaa blessed with a baby girl
ఆర్య సాయేషా

By

Published : Jul 24, 2021, 9:47 AM IST

'సార్పట్ట' సినిమాతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న హీరో ఆర్య తండ్రయ్యాడు. అతడి భార్య, హీరోయిన్ సాయేషా సైగల్​కు శుక్రవారం పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని హీరో విశాల్ ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు.

"ఈ వార్తను బ్రేక్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంకుల్​ అయినందుకు సంతోషంగా అనిపిస్తోంది. మై బ్రో జమ్మీ- సాయేషా దంపతులకు ఆడబిడ్డ పుట్టింది." అని విశాల్ ట్వీట్ చేశాడు.

ఓ సినిమా షూటింగ్​లో కలుసుకున్న ఆర్య- సాయేషా ప్రేమించుకొని, 2019 మార్చి 10న పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ఆమె భర్తతో కలిసి టెడ్డీ సినిమా, కన్నడలో 'యువరత్న' చిత్రం చేసింది. అయితే సాయేషా గర్భం దాల్చిన విషయాన్ని ఇప్పటివరకు బయటపెట్టలేదు. ఆమె ప్రసవించిన తర్వాత, అది హీరో విశాల్​ చెబితేనే అందరికీ తెలిసింది.

ఆర్య-సాయేషా

ఆర్య హీరోగా, బాక్సింగ్ కథతో తీసిన 'సార్పట్ట'.. ఇటీవల ఓటీటీలో విడుదలైంది. మరోవైపు విశాల్​తో కలిసి ఆర్య, 'ఎనిమీ' సినిమా చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details