దూరదర్శన్‌లో(arvind trivedi death) 80వ దశకంలో ప్రదర్శితమైన అపురూప దృశ్య కావ్యం రామాయణ్ ధారావాహికలో రావణుడి పాత్ర పోషించిన ప్రముఖ నటుడు అరవింద్ త్రివేది(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 82 ఏళ్ల అరవింద్ త్రివేది రావణుడి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసులో చెరిగిపోని ముద్ర వేశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
300కిపైగా హిందీ, గుజరాతీ చిత్రాల్లో నటించిన త్రివేది(arvind trivedi movies list) .. 40 ఏళ్ల పాటు సినిమా రంగంలో ఉన్నారు. ప్రముఖ టీవీ షో విక్రమ్ అండ్ బేటల్‌లో తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1991 నుంచి 1996 వరకు గుజరాత్‌లోని సబర్కథ నియోజకవర్గం నుంచి భాజపా పార్లమెంటు సభ్యుడిగా త్రివేది పనిచేశారు.