డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా కోసం స్టైలిష్ ప్రతినాయకుడు రంగంలోని దిగనున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్ ఫిక్షన్లో అరవింద్ స్వామి నటించనున్నాడనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఇతడు 'ధృవ'లో ప్రతినాయకుడిగా మెప్పించాడు. ప్రస్తుతం తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. 2020 అక్టోబరులో షూటింగ్ ప్రారంభించి, 2022 ఏప్రిల్‌లోపు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది.