హిట్ సినిమా ఎక్కడున్నా కొనేసి తీసుకెళ్లిపోతున్నారు నిర్మాతలు. అది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ అయినా... ఇంకే వుడ్ అయినా. ఇప్పుడు అలాంటిదే మరో వార్త... అయితే అది 11 ఏళ్ల క్రితం విడుదలైన సినిమాది కావడం గమనార్హం. రీసెంట్ ట్రెండ్‌కు తగ్గట్టే ఆ సినిమా కూడా మన వుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే... అనుష్క కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'అరుంధతి'.
దశాబ్దం తర్వాత బాలీవుడ్‌కు 'అరుంధతి'! - Arundhati movie
అనుష్క కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం 'అరుంధతి'. ఈ సినిమా విడుదలై 11 ఏళ్లవుతోంది. తాజాగా ఈ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
'అరుంధతి'ని బాలీవుడ్‌కి తీసుకెళ్లడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పడు ఆ అవకాశం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు దక్కిందని తెలుస్తోంది. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి నుంచి ఈ సినిమా రీమేక్ హక్కులు కొన్న అరవింద్, మరో నిర్మాత మధు మంతెనతో కలసి బాలీవుడ్‌లో రీమేక్ చేస్తారని సమాచారం. అనుష్క పాత్ర కోసం ప్రముఖ కథానాయిక దీపికా పదుకొణెను సంప్రదించారని భోగట్టా. అయితే ఈ రీమేక్ విషయంలో అల్లు అరవింద్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అనుష్క కెరీర్‌ని మలుపుతిప్పిన సినిమా 'అరుంధతి'. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో నటనకుగాను అనుష్కకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం కూడా దక్కింది. అనుష్క నటన, కథ-కథనం, విజువల్ ఎఫెక్ట్స్, సోనూ సూద్ పాత్ర మలచిన తీరు, కోడి రామకృష్ణ మాయాజాలం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.