తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'విశ్వాంక్​ పాత్రకు అతడే నా పేరు సూచించాడు' - ప్రభాస్‌

భారీ అంచనాలతో యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్‌ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం 'సాహో.' ఈ సినిమా ప్రీ రిలీజ్​ వేడుక ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​సిటీలో ఘనంగా జరుగుతోంది. విశ్వాంక్​ పాత్రలో నటించిన అరుణ్​ విజయ్​ కార్యక్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నాడు.

'విశ్వాంక్​ పాత్రకు అతడే నా పేరు సూచించాడు'

By

Published : Aug 18, 2019, 9:20 PM IST

Updated : Sep 27, 2019, 10:53 AM IST

కోలీవుడ్ ప్రముఖ నటుడు అరుణ్​ విజయ్​... సాహో సినిమాతో తెలుగు తెరపై మరోసారి కనువిందు చేయనున్నాడు. ఇందులో విశ్వాంక్​ పాత్రలో కనిపించనున్నాడీ తమిళ నటుడు. ఈ పాత్ర కోసం తన పేరు సూచించింది ఎవరో ప్రీ రిలీజ్​ వేడుకలో వెల్లడించాడు.

ప్రీ రిలీజ్​ వేడుకలో మాట్లాడిన అరుణ్​ విజయ్​

"సాహో సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మీ నిరీక్షణకు ఆశించిన ఫలితం ఉంటుంది. విశ్వాంక్​ పాత్ర కోసం ప్రభాస్​ నా పేరు సూచించాడు. ఆయనకు నా ధన్యవాదాలు. ప్రభాస్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. అలాంటి వ్యక్తి నటించిన సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం. సుజీత్‌ చూడటానికి చాలా చిన్నవ్యక్తిగా కనిపించినా... అతని విజన్‌ చాలా పెద్దది. జాకీష్రాఫ్‌, మందిరాబేడి, నీల్‌నితిన్‌ ముకేశ్‌ వంటి అగ్ర నటులతో నటించడం చాలా సంతోషంగా ఉంది. హాలీవుడ్‌ స్థాయిలో సినిమా ఉంటుంది. ఇందులోని ప్రతి సన్నివేశం కోసం ప్రభాస్‌ ఎంతో కష్టపడ్డాడు. ఆ అనుభూతి ఆస్వాదించాలంటే థియేటర్‌లోనే ఆ సినిమా చూడాలి ."
-- అరుణ్​ విజయ్​, సినీ నటుడు.

ఇప్పటికే ప్రభాస్‌కు తమిళంలో చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారని... ఈ సినిమాతో వారి సంఖ్య మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు అరుణ్​. 'బాహుబలి'లో చూసిన ప్రభాస్‌కు... 'సాహో'లో ప్రభాస్‌కు చాలా తేడా ఉంటుందన్నాడు. యాక్టింగ్‌, స్టైల్‌, నటనలో కొత్త ప్రభాస్‌ను చూస్తారని ధీమా వ్యక్తం చేశాడు.

Last Updated : Sep 27, 2019, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details