తెలంగాణ

telangana

ETV Bharat / sitara

370 రద్దుపై బాలీవుడ్​ రియాక్షన్​ ఇదే - Article 370 scrapped

ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం నిర్ణయాన్ని బాలీవుడ్ ప్రముఖులు సమర్థించారు. సామాజిక మాధ్యమాల్లో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

బాలీవుడ్

By

Published : Aug 5, 2019, 6:23 PM IST

'ఆర్టికల్ 370' రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదో చారిత్రక నిర్ణయమని అన్నారు. ఏక్తా కపూర్, దియా మీర్జా, పరేశ్ రావల్, రణ్​వీర్ షోరే, గుల్ పనాగ్, వివేక్ ఒబెరాయ్ తదితరులు తమ అభిప్రాయాల్ని నెట్టింట్లో పంచుకున్నారు.

"ఇది సంపూర్ణ నిర్ణయం. దీంతో కశ్మీర్ ప్రజలు సురక్షితంగా ఉంటారనే నమ్మకముంది." ఏక్తా కపూర్, నిర్మాత

"ఈ పరిణామం ఆహ్వానించదగింది. కశ్మీర్ రాష్ట్రంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు తొలిగిపోవాలి. అక్కడి ప్రజల్లో శాంతి, సౌభాగ్యం నెలకొనాలి." -రణ్​వీర్ షోరే, నటుడు

"శాంతి, సౌభాగ్యం, స్థిరమైన అభివృద్ధి అక్కడి ప్రజలకు కలగనుంది. #లద్దాఖ్, #జమ్ముకశ్మీర్ " -దియా మీర్జా, నటి

"దేశానికి ఈరోజు నిజమైన స్వాతంత్య్ర దినం. 'ఏక్ భారత్' అనే పదానికి సార్థకత వచ్చిన రోజు." -పరేశ్ రావల్, నటుడు, మాజీ ఎంపీ

"సగటు కశ్మీర్ పౌరుల జీవితం త్వరలో మారబోతోందని అనుకుంటున్నాను. అర్టికల్ 370 రద్దు అనేది సాహసోపేత నిర్ణయం." -గుల్ పనాగ్, నటి, నిర్మాత

"సమైక్య భారతదేశం కోసం ప్రాణాలర్పించిన అమర సైనికులకు ఇదే అత్యుత్తమ నివాళి. ధన్యవాదాలు నరేంద్ర మోదీ, అమిత్ షా" -వివేక్ ఒబెరాయ్, నటుడు

ABOUT THE AUTHOR

...view details