తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హృతిక్​ రోషన్ మాజీ​ భార్యతో రిలేషన్​.. ఆ నటుడు క్లారిటీ! - arslan goni sussanne khan dating

హృతిక్​రోషన్​ మాజీ భార్య సుస్సానే ఖాన్​తో తాను రిలేషన్​షిప్​లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై నటుడు అర్స్​లన్​ గోని స్పందించాడు. తను, ఆమె మంచి స్నేహితులమని వివరణ ఇచ్చాడు.

Arslan Goni,  Sussanne Khan
సుస్సానే ఖాన్​, అర్స్​లన్​ గోని

By

Published : Dec 5, 2021, 2:15 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో హృతిక్​ రోషన్​తో విడాకులు తీసుకున్న తర్వాత అతడి మాజీ భార్య సుస్సానే ఖాన్​.. నటుడు అర్స్​లన్​ గోనితో డేటింగ్​ చేస్తున్నట్లు కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే సుస్సానే తన పుట్టినరోజు వేడుకను గోవాలో చేసుకుంది. ఈ పార్టీలో ఆమెతో కలిసి దిగిన ఫొటోను అర్స్​లన్ పోస్ట్​ చేశాడు. ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి.

సుస్సానే ఖాన్​, అర్స్​లన్​ గోని

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్స్​లన్​.. తమపై వస్తున్న రూమర్స్​ విషయమై స్పందించాడు. సుస్సానే తనకు మంచి స్నేహితురాలు అని వివరించాడు. "సోషల్​మీడియాలో ఇలాంటి వార్తలు రావడం సహజం. అది కేవలం బర్త్​డే పార్టీ. మిత్రుల పుట్టినరోజు వేడుకకు ఎవరైనా హాజరుకావచ్చు. నెటిజన్లు ఎప్పుడు ఏదో ఒకటి ఊహించుకుంటూనే ఉంటారు. వాటిని ఎలా డీల్​ చేయాలో మాకు తెలుసు. సుస్సానే, నేను మంచి స్నేహితులం. ఆమె చాలా మంచి వ్యక్తి" అని అన్నాడు.

హృతిక్​రోషన్​, సుస్సానే ఖాన్​.. 2000 డిసెంబరు 20న వివాహం చేసుకున్నారు. వీరికి రిహాన్​, హృదాన్​ కుమారులు ఉన్నారు. 2013 డిసెంబరులో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

సుస్సానే ఖాన్​ బర్త్​డే పార్టీ

ఇదీ చూడండి: మళ్లీ హృతిక్ రోషన్ దగ్గరకొచ్చిన అతడి మాజీ భార్య​

ABOUT THE AUTHOR

...view details