ప్రఖ్యాత 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021కు(Toronto international film festival 2021) తెలుగు నిర్మాత సునీత తాటి తీసిన 'అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' (Arrangements of Love movie) ఎంపికైంది. ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ ఫోరమ్ (ఐఎఫ్‌ఎఫ్) నుంచి ఈ చిత్రోత్సవాలకి వెళుతున్న.. ఆసియా ఖండం నుంచి ఎంపికైన సినిమా ఇదే అని సునీత తాటి ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో చిత్రోత్సవాల్లో(TIFF) ప్రదర్శిస్తారని ఆమె తెలిపారు. గురు ఫిల్మ్స్ పతాకంపై విజయవంతమైన 'ఓ బేబి' మొదలుకొని పలు సినిమాల్ని నిర్మించారు సునీత తాటి.
ప్రఖ్యాత రచయిత టైమెరి ఎన్.మురారి రాసిన ఓ నవల ఆధారంగా 'అరెంట్‌మెంట్స్ ఆఫ్ లవ్'ని తెరకెక్కించారు. వేల్స్‌తో పాటు భారతదేశంలో చిత్రీకరణ జరిపారు. ఫిలిప్‌జాన్ దర్శకత్వం వహించారు.