Arnold Schwarzenegger: హాలీవుడ్ దిగ్గజ నటుడు, 'టెర్మినేటర్' హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆయన త్రుటిలో ఈ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం, ఆర్నాల్డ్ డ్రైవింగ్ చేస్తున్న ఓ కారు.. రోడ్డుపై మరో కారును ఢీ కొట్టింది. దీంతో ఆ కారులో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
ఆర్నాల్డ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, మహిళ ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారని ఆర్నాల్డ్ ప్రతినిధి చెప్పారు. అయితే ఆర్నాల్డ్.. డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకున్న ఆనవాళ్లు ఏం కనిపించట్లేదు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.