కరోనా ప్రభావంచో చాలా చోట్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి. బిజీబిజీగా గడిపే తారలకు అనుకోని ఈ విరామం దొరకడం వల్ల ఇంట్లోనే ఇష్టమైన వ్యాపకాలతో గడిపేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ హీరో, 'టెర్మినేటర్' చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ అయితే గాడిద పిల్ల, గుర్రం పిల్లలతో ఆడుకుంటున్నాడు. అవే ఆయన పెంపుడు జంతువులు.
గాడిద పిల్ల, గుర్రం పిల్లతో టెర్మినేటర్ హీరో - cinema news
కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు సినిమాల చిత్రీకరణలు వాయిదా పడ్డాయి. దీంతో నటీనటులకు కొంత ఖాళీ సమయం దొరికింది. ఈ క్రమంలో ప్రముఖ హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్, పెంపుడు జంతువులతో సరదాగా గడుపుతున్నాడు.
పెంపుడు జంతువులతో టెర్మినేటర్ హీరో
లులూ, విస్కీ అనే పేర్లు పెట్టుకుని ఇంట్లోనే అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. వాటికి క్యారెట్లు తినిపిస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు ఆర్నాల్డ్. "సాధ్యమైనంతవరకూ ఇంట్లోనే ఉండండి. నిపుణుల సలహాలు పాటించండి. అప్పుడు మనం కలిసికట్టుగా కరోనాను అడ్డుకోగలం" అని ట్వీట్ చేశాడు.
ఇదీ చూడండి.. కంటెంటే కింగ్ అని నిరూపించిన బాలీవుడ్ చిత్రాలు