తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అర్జున్​ సురవరం' ఈ సారైనా విడుదలవుతుందా...? - arjun suravaram cinema

నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా 'అర్జున్‌ సురవరం'. చాలా కాలంగా  వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం.. వచ్చే నెల 29న విడుదల కానుంది.

'అర్జున్​ సురవరం' ఈ సారైనా విడుదలవుతుందా...?

By

Published : Oct 26, 2019, 6:49 PM IST

యువహీరో నిఖిల్‌ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలన్ని నిరాశపరిచాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఆ తర్వాత ఎన్నో ఆశలతో 'అర్జున్‌ సురవరం'లో నటించాడు. జర్నలిస్టు పాత్ర పోషించాడు. తమిళ సూపర్‌ హిట్ 'కనితన్‌'కు రీమేక్‌ ఇది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలను విడుదల తేదీ ఖరారు చేసుకుంది. వచ్చే నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకు ముందుగా 'ముద్ర' అనే పేరు పెట్టాలనుకున్నారు. టైటిల్‌ విషయంలో వివాదం తలెత్తిన కారణంగా 'అర్జున్‌ సురవరం'గా మార్చారు. తొలుత మేలో విడుదల చేయాలనుకున్నారు. అప్పుడు మొదలైన వాయిదాలు పర్వం ఇప్పటివరకు కొనసాగింది.

ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌. టి.సంతోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఠాగూర్‌ మధు సమర్పణలో రాజ్‌ కుమార్ నిర్మిస్తున్నారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో తెరకెక్కిందీ చిత్రం.

'అర్జున్​ సురవరం' ఈ సారైనా విడుదలవుతుందా...?

ఇదీ చూడండి : 'ఖైదీ-2' వస్తోంది.. దర్శకుడు ట్వీట్!

ABOUT THE AUTHOR

...view details