నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'అర్జున్ సురవరం'.. ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ప్రత్యేకంగా సక్సస్ టూర్‌ను ఏర్పాటు చేసింది చిత్రబందం. అందులో భాగంగా శనివారం గుంటూరు చేరుకున్నారు. అక్కడ నడిరోడ్డుపై బహిరంగంగా జరుగుతున్న పైరసీని చూసి షాక్‌కు గురయ్యాడు హీరో నిఖిల్.
'అర్జున్'కు పైరసీ కష్టాలు.. క్రిమినల్స్ వారే: నిఖిల్ - hero nikhil
టాలీవుడ్ యువహీరో నిఖిల్‌కు వింత అనుభవం ఎదురైంది. 'అర్జున్ సురవరం' సక్సెస్ టూర్లో భాగంగా గుంటూరు వెళ్లిన ఇతడు.. అక్కడే రోడ్డుపై పైరసీ సీడీలు అమ్మడం చూసి నిర్ఘాంతపోయాడు. ట్విట్టర్‌లో తన బాధను పంచుకున్నాడు.
అర్జున్ సురవరం పైరసీ సీడీని చూపిస్తున్న హీరో నిఖిల్
ఇలా ఎందుకు చేస్తున్నారని సీడీలు విక్రయిస్తున్న వారిని నిఖిల్ అడిగాడు. "అయిన తప్పు వీళ్లది కాదు.. ఎవరైతే వీటిని తయారుచేస్తున్నారో వాళ్లది ఆ తప్పు. వాళ్ళే నిజమైన క్రిమినల్స్" అంటూ ట్విట్టర్‌లో ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అభిమానులెవరూ పైరసీని ప్రొత్సహించొద్దని కోరాడు. వందల మంది కార్మికుల కష్టంతో తెరకెక్కించే సినిమా, ఆ ఫలితాన్ని ఇలా అవహేళన చేయొద్దని అన్నాడు.