తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లైంగిక వేధింపుల కేసులో హీరో అర్జున్​కు క్లీన్​చిట్​ - మీటూ ఉద్యమం

Arjun Sarja sexual misconduct case: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు అర్జున్ సర్జాకు క్లీన్​చిట్​ లభించింది. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. అర్జున్ సర్జా తనను లైంగికంగా వేధించారని నటి శృతి హరిహరన్ 'మీ టూ' ఉద్యమంలో భాగంగా ఆరోపించారు.

Arjun Sarja latest news
అర్జున్ సర్జాపై కేసు

By

Published : Nov 30, 2021, 6:46 PM IST

Arjun Sarja sexual misconduct case: ప్రముఖ దక్షిణ భారత నటుడు అర్జున్ సర్జాకు లైంగిక ఆరోపణల కేసు నుంచి విముక్తి లభించింది. 'మీ టూ' ఉద్యమంలో భాగంగా నటి శృతి హరిహరన్ ఆరోపణలపై నమోదైన కేసులో క్లీన్​చిట్​ ఇచ్చారు పోలీసులు.

అర్జున్ సర్జా తనను లైంగికంగా వేధించారని నటి శృతి హరిహరన్ 'మీ టూ' ఉద్యమంలో భాగంగా ఆరోపించారు. 2018లో 'విస్మయ' కన్నడ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఘటన జరిగిందని సోషల్​ మీడియా వేదికగా నాలుగు పేజీల కాపీని పోస్ట్​ చేశారు. ఈ కేసును బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు మూడేళ్ల క్రితం దర్యాప్తునకు స్వీకరించారు.

అర్జున్​ సర్జాపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. శృతి హరిహరన్ కూడా ఇప్పటివరకు రుజువులను సమర్పించలేకపోయారు. దీంతో ఈ కేసులో నటుడు అర్జున్​పై అభియోగాలు మోపడానికి ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని అడిషనల్​ చీఫ్ మెట్రోపాలిటన్​ మెజిస్ట్రేట్​కు పోలీసులు తెలిపారు.

నటి ఆరోపణలతో కర్ణాటకలో అర్జున్ సర్జా అభిమానులు అప్పట్లో నిరసనలకు దిగారు. దీంతో నటి హరిహరన్​ ఆరోపణలపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఆఫ్​సీసీ) జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. ఆ సమావేశానికి హాజరైన శృతి హరిహరన్.. తన ఆరోపణలను పునరుద్ఘాటించారు.

ఇదీ చదవండి:ఆ ముగ్గురికి నా జీవితంలో ప్రత్యేక స్థానం: బ్రహ్మానందం

ABOUT THE AUTHOR

...view details