'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి సవాలు విసిరాడు. లాక్‌డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఇంటి పని, వంట పని చేస్తూ చాలా మంది సెలబ్రిటీలు కనిపించారు. ఇప్పుడు ఇదే బాటలో వెళ్లిన సందీప్.. వంట సామాగ్రి తోముతూ, ఇల్లు శుభ్రం చేస్తూ కనిపించాడు. ఆ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు.
"పురుషుడూ ఇంటి పనిని గొప్పగా చేయగలడు. నిజమైన పురుషుడు క్వారంటైన్ సమయంలోనూ ఇంటి భారాన్ని, పనిని పూర్తిగా మహిళపై వేయడు. దయచేసి ఇంటి పనిలో సాయం చేయండి. నిజమైనవాడిలా ఉండండి. ఎస్.ఎస్. రాజమౌళి సర్.. మీరూ ఇలాంటి వీడియోను అప్‌లోడ్ చేసి, అందరిలోనూ స్ఫూర్తి నింపాలని కోరుతున్నా" -సందీప్ రెడ్డి వంగా, దర్శకుడు