తెలుగులో సీక్వెల్ సినిమాలు అడపాదడపా వస్తుంటాయి. కానీ హిందీలో అయితే హిట్ అయిన ప్రతి సినిమాకి సీక్వెల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు అక్కడి దర్శక నిర్మాతలు. ఫ్రాంచైజీ చిత్రాలకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే 2014లో హిట్ అయిన 'ఏక్ విలన్' చిత్రానికి కొనసాగింపుగా ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ఇందులో అర్జున్ కపూర్ విలన్‌గా కనిపించనున్నాడని సమాచారం.
విలన్‌గా మారనున్న అర్జున్ కపూర్? - bollywood hero arjun kapoor
మరో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ విలన్ అవతారమెత్తనున్నాడు. 'ఏక్ విలన్' సీక్వెల్లో అర్జున్ కపూర్ ప్రతినాయకుడిగా చేయబోతున్నడాని సమాచారం.
అర్జున్
'ధూమ్'లో లాగే 'ఏక్ విలన్'లో ప్రతినాయకుడి పాత్ర కీ రోల్ పోషిస్తుంది. మరి కథానాయకుడి స్థానంలో ఎవరు నటిస్తారనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతం అర్జున్ కపూర్.. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలోని చారిత్రక చిత్రం 'పానిపట్'లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది 'ఏక్ విలన్' చిత్రీకరణలో పాల్గొనే అవకాశాలున్నాయి.
ఇవీ చూడండి.. ఆకట్టుకుంటోన్న 'మర్జావాన్' సాంగ్