జాన్వీకపూర్(Janhvi Kapoor) తనను అన్నయ్య అని పిలుస్తుంటే కొత్తగా అనిపిస్తుందని బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్(Arjun Kapoor) చెప్పుకొచ్చారు. జాన్వీ ఎప్పుడు 'అర్జున్ భయ్యా' అని పిలిచినా ఆ మాట ఆర్తితో ఆమె హృదయంలో నుంచి వచ్చినట్లు అనిపిస్తుందని అన్నారు. తనను ఫలానా పేరుతో పిలవాలని ఎప్పుడూ ఆమెకు చెప్పలేదని వివరించారు. ఇటీవలే బాలీవుడ్ ఫిల్మ్ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అర్జున్ ఈ విషయాన్ని చెప్పాడు.
"బ్రదర్ అర్జున్ అనే శబ్దం ప్రేమతో, భక్తిభావనతో పిలిచినట్లు అనిపిస్తుంది. 'అర్జున్ భయ్యా' అనే పదం నాకు ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే నా సొంత సోదరి అన్షుల్లా చాలా అరుదుగా 'భయ్యా' అని పిలుస్తుంది. అలాంటిది జాన్వీ 'అర్జున్ భయ్యా' అని పిలిచినప్పుడు కొత్తగా ఉంటుంది. అది కూడా ఆమె హృదయంలో నుంచి ప్రేమగా పిలిచినట్లు అనిపిస్తుంది. నేనెప్పుడూ ఆమెను ఇలాగే పిలువు అని చెప్పలేదు."