తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నా వాట్సప్ నెంబర్ చెప్పాలనుంది.. కానీ!' - అరియానా పేవరెట్ హీరో

యాంకర్​గా రాణించి బిగ్​బాస్​ 4తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అరియానా. ప్రస్తుతం లాక్​డౌన్​లో ఇంట్లోనే ఉంటోన్న ఈ భామ ఇన్​స్టాలో అభిమానులతో ముచ్చటించింది.

Ariyana
అరియానా

By

Published : May 27, 2021, 1:03 PM IST

వ్యాఖ్యాతగా యువతకు చేరువై.. బిగ్​బాస్​ 4తో తెలుగువారికి మరింత దగ్గరైన చిన్నది అరియానా (Bigboss Ariyana).ఈ సీజన్​లో టాప్​-5లో నిలిచి గట్టిపోటీ ఇచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడం వల్ల ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉండటం వల్ల బోర్‌ కొడుతోందని తెలిపింది. అలాగే, చాలారోజుల తర్వాత ఎక్కువ ఖాళీ దొరకిన కారణంగా వెబ్‌ సిరీస్‌లు అన్నింటినీ చాలావరకూ చూశానని వెల్లడించింది.

మీకిష్టమైన కలర్‌?

నా మేనికి నప్పే అన్ని రకాల రంగులను నేను ఇష్టపడతా.

లాక్‌డౌన్‌లో మీ సమయం ఎలా గడుస్తుంది?

బెడ్‌రూమ్‌ టు హాల్‌.. హాల్‌ టు బెడ్‌రూమ్‌.. కాకపోతే ఈ రెండుచోట్ల టీవీ చూస్తూనే గడిపేస్తున్నా. వరుసగా అన్ని వెబ్‌ సిరీస్‌లు చూసేస్తున్నా.

అరియానా

మీరు యూట్యూబ్‌ వీడియోలు ఎందుకుని చేయడం లేదు?

నేను యూట్యూబ్‌కి చాలా కొత్త. అందులో ఎలాంటి కంటెంట్‌తో వీడియోలు చేయాలో అర్థం కావడం లేదు. కొన్నిసార్లు అయితే ఏం చేయాలో తెలియక చిరాకు వస్తుంది.

యాకరింగ్‌ లేదా యాక్టింగ్‌?

ఫస్ట్‌ యాకరింగ్.. ఆ తర్వాతే యాక్టింగ్‌. రెండింటిలో అవకాశాలు వచ్చినా చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే, యాక్టింగ్‌ కంటే కూడా యాకరింగ్‌ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం.

లాక్‌డౌన్‌ని ఎలా డీల్‌ చేస్తున్నారు?

నాకేం అర్థం కావడం లేదు. ఇంట్లోనే ఉండడం వల్ల బోర్‌ కొడుతుంది.

అరియానా

మీ ఫేవరెట్‌ సాంగ్‌ ఏమిటి?

ఫేవరెట్‌ సాంగ్‌ అని చెప్పలేను కానీ 'రెడ్డిగారి అమ్మాయి' పాటలోని లిరిక్స్‌ నాకు బాగా నచ్చాయి. దానిపై రీల్‌ చేయాలని ఉంది.

మీరు ఎమోషన్స్‌ ఎలా కంట్రోల్‌ చేసుకుంటారు?

నిజం చెప్పాలంటే నాకు కోపం ఎక్కువ. ఊరికే కోపం వచ్చేస్తుండేది. ఓసారి ఆర్జీవీని ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ఆయన కుదిరితే రాముఇజం (Ramuism) చూడమని చెప్పారు. దానితోపాటు The Power of your subconscious mind అనే బుక్ కూడా చదివాను. ఈ రెండింటి వల్ల నా కోపాన్ని, ఎమోషన్స్‌ని బాగా కంట్రోల్‌ చేసుకోగలిగాను.

అరియానా

పెద్దల కుదిర్చిన వివాహమా? లేదా ప్రేమ వివాహమా?

పెద్దల కుదిర్చిన వివాహం చాలా కష్టం. లవ్‌ మ్యారేజ్‌ కూడా కష్టమే ఎందుకంటే ఫ్రెండ్స్‌లా ఉండి.. నా కోపం చూశాక కూడా అతను నన్ను పెళ్లి చేసుకోగలడా. చేసుకోకపోతే నేను ఊరుకోను కదా.

మీ క్రష్‌ ఎవరు?

క్రష్‌ అంటే ఉన్నారు. కానీ, బయటకు చెప్పను.

మీ వాట్సాప్‌ నంబర్‌ ఇవ్వొచ్చుగా

మీ అందరికీ నా వాట్సాప్‌ నంబర్‌ ఇవ్వాలనే ఉంటుంది. కానీ ఇవ్వలేను. ఎందుకంటే ఇంట్లో చంపేస్తారు.

ABOUT THE AUTHOR

...view details