తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యువ హీరోతో కల్యాణి ప్రియదర్శన్​ ప్రేమాయణం! - ప్రణవ్​ మోహన్​లాల్​, కల్యాణి ప్రియదర్శన్​ న్యూస్​

మలయాళ హీరో మోహన్​లాల్​ తనయుడు ప్రణవ్​, హీరోయిన్​ కల్యాణి ప్రియదర్శన్​ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చిన్ననాటి స్నేహితులైన వీరిద్దరూ ప్రస్తుతం లవ్​బర్డ్స్​గా మారారని సినీవర్గాలు అంటున్నాయి. ఇద్దరూ కలిసి ప్రస్తుతం 'హృదయం' అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు.

Are Kalyani Priyadarshan and Pranav in a relationship? Here's what Mohanlal has to say
మోహన్​లాల్​ తనయుడితో కల్యాణి ప్రియదర్శిన్​ ప్రేమాయణం!

By

Published : Aug 19, 2020, 10:44 AM IST

Updated : Aug 19, 2020, 11:41 AM IST

'హాలో' అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్​ కల్యాణి ప్రియదర్శన్​.. ప్రస్తుతం మోహన్​లాల్​ తనయుడు ప్రణవ్​తో కలిసి 'హృదయం' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్​లో వీరిద్దరూ ప్రేమపాఠాలు నేర్చుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

ప్రణవ్​-ప్రియల కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. అంతేకాదు ఇరువురు చిన్ననాటి నుంచి స్నేహితులే కావడం విశేషం. ఇప్పుడా స్నేహమే ప్రేమగా చిగురించి ఒక్కటవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. వీరి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ప్రణవ్​ మోహన్​లాల్​తో కల్యాణి ప్రియదర్శన్​

కల్యాణి ప్రియదర్శిన్​.. 'హాలో' చిత్రంతో అఖిల్​ సరసన హీరోయిన్​గా నటించి టాలీవుడ్​కు పరిచయమైంది. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్​తో 'చిత్రలహరి', శర్వానంద్​తో 'రణరంగం'లో తెరపై కనిపించి మెప్పించింది. ప్రస్తుతం కల్యాణి నటిస్తున్న 'హృదయం' చిత్రానికి వినీత్​ శ్రీనివాసన్​ దర్శకత్వం వహిస్తున్నాడు. మెర్రీల్యాండ్​ సినిమాస్​ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రానికి.. విశాఖ సుబ్రమణ్యం, నోబెల్​బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇందులో దర్శన రాజేంద్రన్​, మాయానాది, విజయ్​లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రణవ్​-కల్యాణిలు కలిసి 'మరక్కర్​: అరబికాడలింటే సింహామ్​' చిత్రంలోనూ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

Last Updated : Aug 19, 2020, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details