తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హారర్ చిత్రంలో మల్లికా శెరావత్‌, అర్బాజ్‌ ఖాన్ - రోసీ చిత్రంతో మల్లికా షెరావత్

‌వివేక్ ఒబెరాయ్, పాలక్ తివారీ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'రోసీ: ది సఫ్రాన్ చాప్టర్'. విశాల్ రంజన్ మిశ్రా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మల్లికా షెరావత్, అర్బాజ్ ఖాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నట్లు వెల్లడించింది చిత్రబృందం.

Arbaz Khan and Mallika
మల్లికా శెరావత్‌, అర్బాజ్‌ ఖాన్

By

Published : Apr 3, 2021, 7:31 AM IST

గురుగ్రామ్‌లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రం 'రోసీ: ది సఫ్రాన్‌ చాఫ్టర్‌'. విశాల్ రంజన్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వివేక్‌ ఒబెరాయ్‌ నిర్మాత, నటుడిగా వ్యవహరిస్తున్నారు. పాలక్‌ తివారీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో మల్లికా షెరావత్‌, అర్బాజ్‌ ఖాన్‌ కీలక పాత్రల్లో నటించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం సినిమా చివరి షెడ్యూల్‌ జరుపుకొంటోంది.

"చిత్ర సీమలో 20 ఏళ్లుగా లైన్ ప్రొడ్యూసర్లుగా ఉన్నాం. సినిమా నిర్మాణంలోకి ప్రవేశించడం సంతోషంగా ఉంది. నిర్మాతలుగా తొలిసారి 'రోసీ' చిత్రం చేస్తున్నాం. ఇందులో అర్బాజ్ ఖాన్, మల్లికా షెరావత్ కీలక పాత్రల్లో నటిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు చిత్ర నిర్మాతలు సల్మాన్‌ ఎం.షేక్, మనన్‌ సంపత్.

ABOUT THE AUTHOR

...view details