తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గుసగుస: 'ఎమ్​జీఆర్‌'గా అరవింద్‌ స్వామి - cinema

దివంగత జయలలిత జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఎమ్​జీఆర్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు అరవింద్​ స్వామి నటిస్తున్నట్లు సమాచారం.

అరవింద్

By

Published : Aug 10, 2019, 7:30 AM IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఎమ్​జీఆర్​ పాత్రలో 'రోజా' హీరో అరవింద్​ స్వామి నటించనున్నారట. ఎమ్​జీఆర్​ 1977 నుంచి 1987 వరకు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ నటిస్తోంది.

చిత్రానికి 'తలైవా' లేదా 'జయ' అనే టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. సినిమాకు విజయ్‌ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమా వల్ల కంగనా - అరవింద్‌ తొలిసారిగా కలిసి పనిచేయనున్నారు. కంగనా ఈ చిత్రం కోసం తమిళ భాషతో పాటు భరతనాట్యమూ నేర్చుకుంటుందట. ఎందుకంటే జయలలితకు భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది.

ఈ ఏడాది అక్టోబర్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. తెలుగులో నేరుగా వచ్చిన అరవింద్​ స్వామి చిత్రం 'మౌనం' (1995). ఆ తర్వాత రామ్‌ చరణ్‌తో కలిసి 'ధృవ'లో ప్రతినాయకుడిగా కనిపించాడు.

ఇవీ చూడండి.. ఈ అవార్డు అమ్మకు అంకితమిస్తున్నా: కీర్తి సురేశ్

ABOUT THE AUTHOR

...view details