తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఛలో ఛలో' పాట ధోనీకి అంకితం: రెహమాన్​ - చైన్నై సూపర్​ కింగ్స్

ధోనీ బాగా ఆడాలని 'లగాన్'​ చిత్రంలోని 'ఛలో ఛలో' పాటను ఆయనకు అంకితమిచ్చారు సంగీత దర్శకుడు ఏఆర్​ రెహమాన్​. సురేశ్​ రైనాకు 'మంగ్తా హై క్యా' చిత్రంలోని 'రంగీలా' పాటను అంకితమిచ్చారు.

ms-dhoni, rehman
ఏ ఆర్​ రెహమాన్​, ధోని

By

Published : Apr 16, 2021, 9:34 PM IST

'లగాన్​' చిత్రంలోని 'ఛలో ఛలో' పాటను చైన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్​ ధోనీకి అంకితమిచ్చారు సంగీత దర్శకుడు ఏఆర్​ రెహమాన్​. అంతకుముందు సురేశ్​ రైనాకు 'మంగ్తా హై క్యా' చిత్రంలోని 'రంగీలా' పాటను అంకితమిచ్చారు. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్​ క్రికెట్​ లైవ్​ షోలో రెహమాన్​ మాట్లాడారు. ధోనీ బాగా ఆడాలనే ఈ 'ఛలో ఛలో' పాటను ఆయనకు అంకితమిచ్చినట్లు చెప్పుకొచ్చారు.

చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా రావాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ సూచించాడు. ఒకప్పటిలా అతడు మైదానం నలుమూలలా షాట్లు కొట్టలేకపోతున్నాడని అన్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి, నడిపించడం కష్టమని అన్నాడు. దిల్లీతో జరిగిన మ్యాచ్​లో ధోనీ డకౌట్​ అయ్యాడు.

ఇదీ చదవండి:సీఎస్కే కెప్టెన్ ధోనీ మరో రికార్డు

ABOUT THE AUTHOR

...view details