AR Rahman Daughter: మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ పెద్ద కూతురు ఖతీజా రెహమాన్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని ఆమె ఆదివారం ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. రియాస్దీన్ షేక్ మహ్మద్ అనే వ్యక్తితో డిసెంబర్ 29న తన ఎంగేజ్మెంట్ జరిగిందని తెలిపారు ఖతీజా.
"భగవంతుని దీవెనలతో రియాస్దీన్ షేక్ మహ్మద్‌తో డిసెంబర్ 29న నా ఎంగేజ్మెంట్ జరిగింది. దగ్గరి బంధువుల సమక్షంలో నా పుట్టినరోజునే ఈ వేడుక జరిగింది. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను."