బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తోన్న కొత్త చిత్రం 'పృథ్వీరాజ్'. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అక్షయ్ సరసన ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కోసం అక్షయ్ ప్రత్యేకంగా ఓ డైలాగ్ కోచ్‌ని పెట్టుకున్నాడట. ఇలా చేయడం అక్షయ్‌కు ఇదే తొలిసారి.
అక్షయ్‌కు డైలాగ్ డెలివరీలో ప్రత్యేక శిక్షణ! - పృథ్వీరాజ్ చౌహాన్ సినిమా
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించే కొత్త చిత్రం కోసం ఓ డైలాగ్ కోచ్‌ను నియమించుకున్నాడని సమాచారం. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కే 'పృథ్వీరాజ్' సినిమా కోసం సంభాషణలలో తర్ఫీదు పొందుతున్నాడని తెలుస్తోంది.
అక్షయ్‌కు డైలాగ్ డెలివరీలో ప్రత్యేక శిక్షణ!
చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలోని సంభాషణలను బాగా పలకాలంటే కోచ్‌ను పెట్టుకోవాల్సిన అవసరం ఉందని భావించాడట అక్షయ్. ఇందులో మానుషి చిల్లర్ పృథ్వీరాజ్ చౌహాన్ భార్య సన్యోయోగిత పాత్రలో తెరపై కనిపించనుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అక్షయ్ నటించిన 'సూర్యవంశీ' చిత్రం విడుదల వాయిదా పడింది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న 'లక్ష్మీబాంబ్' చిత్రంలోనూ అక్షయ్ నటిస్తున్నాడు.
ఇదీ చూడండి.. క్రిష్ దర్శకత్వంలో పవర్‌స్టార్ ద్విపాత్రాభినయం!