మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) 'ఆచార్య'(Acharya Movie) షూటింగ్ చివరి షెడ్యూల్ పూర్తయింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిందని చిత్రబృందం వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిరు, రామ్‌చరణ్(Ram Charan) కలిసి ఉన్న ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఆగస్టు 20 నుంచి చిరంజీవి, రామ్ చరణ్‌లపై ఒక పాటను.. అలాగే చరణ్, పూజా హెగ్డేలపై మరోపాటను చిత్రీకరిస్తామని దర్శకుడు కొరటాల శివ తెలిపారు.
Acharya Update: చిరు-చరణ్ 'ఆచార్య' చిత్రీకరణ పూర్తి - రామ్‌చరణ్
స్టార్ హీరో చిరంజీవి 'ఆచార్య' కూడా రిలీజ్ రేసులోకి వచ్చేసింది. రెండు పాటల మినహా టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల తేదీపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నారు.
దేవాలయాల, నక్సలైట్లు నేపథ్య కథాంశంతో 'ఆచార్య' సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ(Koratala Siva). ఇప్పటికే వచ్చిన టీజర్, 'లాహే లాహే' సాంగ్(Lahe Lahe Song).. అభిమానుల్ని అలరిస్తూ అంచనాల్ని పెంచేస్తున్నాయి. త్వరలో విడుదల చిత్ర తేదీపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. కాజల్(Kajal Aggarwal) హీరోయిన్గా, పూజా హెగ్డే(Pooja Hegde).. ప్రత్యేక పాత్ర చేస్తున్న రామ్‌చరణ్‌కు జోడీగా నటిస్తోంది.
ఇదీ చూడండి..Acharya Shoot: తిరిగి తెరుచుకున్న ధర్మస్థలి!