తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హిందీ​ కాటమరాయుడిగా ఉరీ హీరో - బాలీవుడ్​

తమిళంలో భారీ హిట్ సాధించిన వీరం సినిమా.. తెలుగులో కాటమరాయుడిగా 2017లో రీమేక్​ అయింది. పంచెకట్టులో పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ గెటప్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్​లో అడుగుపెట్టనుంది. ఉరీ సినిమా హీరో విక్కీ కౌషల్ ప్రధాన పాత్రలో​ నటించనున్నాడు.

విక్కీ కౌశల్

By

Published : Jun 9, 2019, 10:40 AM IST

విక్కీ కౌశల్​... ఉరీ సినిమా హిట్​తో అమాంతం బాలీవుడ్​ స్టార్​గా ఎదిగాడు. ఆ సినిమాలో పవర్​ఫుల్​ జవాన్​ పాత్రలో కనిపించాడు. త్వరలో కాటమరాయుడి వేషం వేయనున్నాడు. తమిళ సినిమా వీరంలో రీమేక్​లో అతడు హీరోగా నటించనున్నాడు.

2014లో అజిత్ హీరోగా నటించిన తమిళ చిత్రం వీరం భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ హీరోగా తెలుగులో కాటమరాయుడు పేరుతో 2017లో రీమేక్​ అయింది. ఇప్పుడు బాలీవుడ్​లో అడుగుపెట్టనుంది. ఈ సినిమాకు 'ల్యాండ్​ ఆఫ్​ లుంగీ' పేరును అనుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు ఉరీ: ద సర్జికల్ స్ట్రయిక్​తో జోష్​ మీదున్న హీరో విక్కీ కౌశల్​. సాజిద్ నదియద్వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫర్హత్​ సమ్జీ దర్శకత్వం వహించనున్నాడు.

వీరం రీమేక్​ కోసం బాలీవుడ్​ హీరో అక్షయ్ కుమార్​ను చిత్ర బృందం సంప్రదించినట్టు సమాచారం. అయితే డేట్లు ఖాళీ లేని కారణంగా అక్షయ్ తిరస్కరించాడు. ప్రస్తుతం లక్ష్మీబాంబ్, సూర్యవంశీ, ద ఎండ్​ చిత్రాల్లో నటిస్తున్నాడు అక్షయ్. ప్యాడ్​మ్యాన్​ తప్పుకోవడం వల్ల విక్కీకి లక్కీ ఛాన్స్​ వచ్చింది.

ఇదీ చూడండి : ఆసీస్​-భారత్​ మ్యాచ్​కు మహేశ్​బాబు..!

ABOUT THE AUTHOR

...view details