తెలంగాణ

telangana

By

Published : Sep 8, 2021, 4:00 PM IST

ETV Bharat / sitara

ఇకపై ప్రభుత్వ వెబ్​సైట్​లో సినిమా టికెట్స్..

ఇకపై సినిమా టికెట్​ కొనాలంటే థియేటర్​ వరకు, యాప్​లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం దాని కోసం ఓ వెబ్​సైట్​ రన్​ చేసేందుకు సిద్ధమవుతోంది.

ap govt run website for movie tickets
మూవీ టికెట్ ఇష్యూ

ఒకప్పుడు సినిమా చూడాలంటే టికెట్‌ కోసం క్యూలైన్‌లో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. అదే అగ్ర కథానాయకుడి సినిమా అయితే, తెల్లవారుజాము నుంచే థియేటర్‌ వద్ద పడిగాపులు కాసేవారు. టికెట్ల కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌/యాప్‌లు వచ్చిన తర్వాత ప్రేక్షకుడికి ఉపశమనం లభించింది. ఇప్పుడు సినిమా టికెట్ల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. టికెట్‌ ధరల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది.

థియేటర్

"సినిమా థియేటర్స్‌లో టికెట్స్‌ విక్రయించే ప్రక్రియను ప్రభుత్వం నిశితంగా గమనించిన తర్వాత, రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుంది. ఇందుకు సంబంధించిన విధి-విధానాలు, అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుంది" అని ఏపీ ప్రభుత్వం జీవోలో తెలిపింది.

మరోవైపు తెలంగాణ కూడా ఇదే బాటలో పయనిస్తుందా? లేదా? తెలియాల్సి ఉంది. కరోనా కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిబంధనల మేరకు చిత్రీకరణలు జరుగుతున్నా, పెద్ద సినిమాలు థియేటర్‌లో విడుదలయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. తెలంగాణ థియేటర్స్‌ పూర్తిగా అందుబాటులోకి వచ్చినా, ఏపీలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయి. దీంతో నిర్మాతలు, థియేటర్స్‌ యజమానులు, పంపిణీదారులు ఏదో రూపంలో నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details