తెలుగులో నాయికా ప్రాధాన్యమున్న కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది హీరోయిన్ అనుష్క. 'అరుంధతి', 'భాగమతి' వంటి చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించి, ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే తరహా కథలో మరోసారి కనిపించనుందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
మరోసారి అలాంటి కథలో అనుష్క? - anuskha acting with uv creations
హీరోయిన్ అనుష్క.. మరోసారి కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంలో నటించనుందని సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు ఊపందుకున్నట్లు తెలుస్తోంది.
![మరోసారి అలాంటి కథలో అనుష్క? Anushka will once again be seen in the lead role at heroin based movie?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7619375-715-7619375-1592183626689.jpg)
అనుష్క శెట్టి
ఓ యువ దర్శకుడు, అనుష్క కోసమే సిద్ధం చేసిన ఓ కథను ఇటీవలే ఆమెకు వినిపించినట్టు సమాచారం. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు ఊపందుకున్నాయని సమాచారం. ఇటీవల అనుష్క 'నిశ్శబ్దం'లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి:స్వీటీ అనుష్కశెట్టి మరో మైలురాయి