తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహిళా యోధురాలి బయోపిక్​లో అనుష్క! - అనుష్క శెట్టి న్యూస్​

ఇప్పటికే పలు హీరోయిన్​ ఓరియెంటెడ్​ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్​ స్టార్​ నటి అనుష్క. అయితే ఈ జోనర్​లో మరో సినిమాలో నటించనున్నట్లు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Anushka will going to lead in karnataka singer naga rathhamma biopic
మహిళా యోధురాలి బయోపిక్​లో అనుష్క

By

Published : Mar 22, 2020, 1:43 PM IST

టాలీవుడ్ స్టార్​ హీరోయిన్​ అనుష్క శెట్టి.. లేడీ ఓరియెంటెడ్​ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటిసారి 'అరుంధతి' చిత్రంతో ఆ జోనర్​లో సినిమాలు చేయడం మొదలుపెట్టగా.. 2018లో విడుదలైన 'భాగమతి' చిత్రం మంచి పేరుతెచ్చి పెట్టింది. ఆమె నటించిన 'నిశ్శబ్దం' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో మాధవన్​ ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు.

అనుష్క శెట్టి

ప్రస్తుతం అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి సిద్ధమవుతోందని సమాచారం. కర్ణాటక్ సింగర్, మహిళా హక్కుల పోరాట యోధురాలైన బెంగళూరు నాగరత్తమ్మ బయోపిక్​ను దర్శకుడు సింగీతం శ్రీనివాసరావ్ తెరకెక్కించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తి వివరాల కోసం అధికార ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి.. రొయ్యల కూర చేసిన బాలీవుడ్ హీరో

ABOUT THE AUTHOR

...view details