తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క పాత్రేమిటి..? - రాంచరణ్

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న సినిమా 'సైరా'లో కథానాయిక అనుష్క శెట్టి పాల్గొంది. కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యముందని తెలుస్తుంది.

'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క పాత్రేమిటి..?

By

Published : May 16, 2019, 8:44 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'సైరా నరసింహారెడ్డి'. నయనతార హీరోయిన్​గా, తమన్నా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే అనుష్క శెట్టి షూటింగ్​లో పాల్గొంది. ఆమె క‌నిపించేది నాలుగైదు స‌న్నివేశాలే అయినప్పటికీ... కథలో ఇది కీలకమైన పాత్ర అని తెలుస్తుంది. ఇంతకు ముందు అనుష్క స్థానంలో ఐశ్యర్వరాయ్​ను సంప్రదించినట్లు సమాచారం.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details