తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవర్​స్టార్​తో అనుష్క.. అభిమానులకు పండగే!

పవన్ కల్యాణ్-క్రిష్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో హీరోయిన్​గా అనుష్క నటించనుందంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ విషయంపై స్పష్టత రానుంది.

పవన్
పవన్

By

Published : Apr 6, 2020, 9:42 AM IST

పవర్​స్టార్ పవన్‌ కల్యాణ్‌ సరసన స్వీటీ అనుష్క నటించనుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పవన్​ హీరోగా క్రిష్‌ ఓ చిత్రం తీస్తున్నాడు. చారిత్రక నేపథ్య కథతో తెరకెక్కుతుంది. ఇందులో నటించే హీరోయిన్‌ ఈమెనే అంటూ చాలామంది పేర్లు వినిపించాయి. తాజాగా ఆ జాబితాలో అనుష్క చేరింది. స్వీటీనే కథానాయిక పాత్ర కోసం తీసుకునే ప్రయత్నంలో చిత్రబృందం ఉందని టాక్.

ఇప్పటికే ఆమెకు కథ వినిపించారని, త్వరలో ఈ విషయంపై స్పష్టత రానుందట. మరి అనుష్కనే ఖరారు చేస్తారా? లేదా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. గతంలో క్రిష్‌ తీసిన 'వేదం'లో వేశ్య పాత్రలో నటించి మెప్పించిందీ భామ. మరోసారి ఈ కాంబినేషన్‌ అనగానే అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాకు కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. కరోనా కారణంగా ప్రస్తుతం నిలిచిపోయింది.

ABOUT THE AUTHOR

...view details