విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా అనుష్క శర్మ అతడికి అరుదైన బహుమతి ఇచ్చింది. మంగళవారం 31 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లీని ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లింది. వీరిద్దరూభూటాన్ పర్వత ప్రాంతాల్లో విహరిస్తున్నారు. ఈ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు విరుష్క దంపతులు.
"నా జీవిత భాగస్వామితో పవిత్ర ప్రదేశాన్ని వీక్షించా. ఎంతో అద్బుతంగా ఉంది. నాకు శుభాకాంక్షలు చెప్పిన అందరికి ధన్యవాదాలు" - విరాట్ కోహ్లీ, టీమిండియా క్రికెటర్