స్వీటీ అనుష్క శెట్టి నటించిన 'నిశ్శబ్దం' సినిమాను థియేటర్లలో విడుదల చేయమని, సెన్సార్ సభ్యులు తమకు సలహా ఇచ్చారని చెప్పారు దర్శకుడు హేమంత్ మధుకర్. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. యూబైఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఓటీటీలో నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈయన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. అయితే ఎందులో విడుదల చేస్తారనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
'నిశ్శబ్దం' విడుదలపై సెన్సార్ సభ్యుల సలహా - అనుష్క నిశ్శబ్దం సినిమా
సెన్సార్ పూర్తి చేసుకున్న 'నిశ్శబ్దం'.. ఎక్కడ విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు హేమంత్ మధుకర్ ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది.
'నిశ్శబ్దం' సినిమాలో అనుష్కశెట్టి
థ్రిల్లర్ కథతో తీసిన 'నిశ్శబ్దం'.. ఏప్రిల్ 9న విడుదల కావాలి. కానీ కరోనా ప్రభావంతో లాక్డౌన్ విధించడం.. ఆపై థియేటర్ల మూసివేయడం దీనికి అడ్డంకిగా మారింది. ఇందులో అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. గోపీసుందర్ సంగీతమందించగా, హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.