తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భాగ్యనగరంలో బొద్దుగా కనిపించిన బొమ్మాళీ - భాగ్యనగరంలో బొద్దుగా కనిపించిన బొమ్మాలి

దక్షిణాది స్టార్​ హీరోయిన్​ అనుష్క శెట్టి ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. ప్రస్తుతం 'నిశబ్దం' షూటింగ్​లో బిజీగా ఉన్న ఈ అమ్మడు... ఇటీవల శంషాబాద్​ విమానాశ్రయంలో బొద్దుగా దర్శనమిచ్చింది. ప్రస్తుతం స్వీటీ లుక్​  నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

భాగ్యనగరంలో బొద్దుగా కనిపించిన బొమ్మాలి

By

Published : Sep 5, 2019, 7:06 AM IST

Updated : Sep 29, 2019, 12:11 PM IST

ప్రముఖ నటి అనుష్క శెట్టి మళ్లీ బొద్దుగా కనిపించి అభిమానులను సర్​ప్రైజ్​ చేసింది. 'సైజ్​ జీరో' సినిమా కోసం భారీగా బరువు పెరిగిన ఈ అమ్మడు... ఇటీవల 'నిశబ్దం' అనే చిత్ర షూటింగ్​లో స్లిమ్‌ లుక్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న స్వీటీ... తాజాగా హైదరాబాద్‌ విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కింది. ఇందులో మళ్లీ చబ్బీ చబ్బీగా దర్శనమిచ్చిందీ బొమ్మాళీ.

నిశ్శబ్ధంలో అనుష్క

నిశబ్దంలో అనుష్కకు జంటగా మాధవన్​ నటిస్తున్నాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ వెండితెరపై సందడి చేయనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకుడు. అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల లాంటి తారాగణం ఇందులో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్​లుక్​ ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది జనవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి...బోల్డ్​ పాత్రతో కన్నడలోకి ప్రియా వారియర్​

Last Updated : Sep 29, 2019, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details