టాలీవుడ్‌లో హిట్ జోడీ అనుష్క-ప్రభాస్ ప్రేమ గురించి మరోసారి చర్చ మొదలైంది. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో 'బాహుబలి' ప్రీమియర్ కోసం వెళ్తూ...వీరిద్దరూ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించడమే ఇందుకు కారణం.
విమానాశ్రయంలో కనిపించిన అనుష్క, ప్రభాస్ ఇద్దరూ నలుపు రంగు దుస్తుల్లో కనివిందు చేయగా... ఈ ఫొటోలు సామాజిక మధ్యమాల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే అనుష్కశెట్టి తనకు మంచి స్నేహితురాలని గతంలోనే వివరణ ఇచ్చాడీ హీరో.
అనుష్క,ప్రభాస్ జంటగా 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాల్లో నటించారు. ఈ జోడీకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.
ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు ప్రభాస్. 'జాన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ నెల 23న డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ లేదా సినిమా పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వీటీ అనుష్క ప్రస్తుతం 'నిశ్శబ్దం'లో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది.