తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నిశ్శబ్దం'గా షూటింగ్ ముగించిన అనుష్క - Anushka Shetty

అనుష్క శెట్టి, మాధవన్​ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'నిశ్శబ్దం'. చిత్రీకరణ పూర్తిచేసుకున్న సందర్భంగా ఫోటోను ట్విట్టర్​లో పంచుకున్నారు నిర్మాత కోన వెంకట్.

అనుష్క శెట్టి

By

Published : Aug 5, 2019, 5:19 PM IST

దాదాపు ఏడాది విరామం తర్వాత ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది​ అనుష్క శెట్టి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'నిశ్శబ్దం'. మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్​ పూర్తి చేసుకున్న సందర్భంగా అనుష్కతో కలిసున్న ఫొటోలను ట్వీట్ చేశారు నిర్మాత కోన వెంకట్.

'చివరకు 'నిశ్శబ్దం' షూటింగ్ పూర్తయింది. మీకు థ్రిల్లర్​ సినిమాను చూపించేందుకు మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.' -కోన వెంకట్, నిర్మాత

హాలీవుడ్ నటుడు మైఖేల్‌ మాడ్సెన్, అంజలి, శాలిని పాండే, సుబ్బరాజ్​ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. ఎప్పుడు విడుదల చేస్తారనేది త్వరలో ప్రకటించనున్నారు.

'నిశ్శబ్దం' టీమ్
'నిశ్శబ్దం' టీమ్

ఇదీ చూడండి: 'చాలా తీసుకున్నాం తిరిగి ఇచ్చేయాలి'

ABOUT THE AUTHOR

...view details