దక్షిణాది నటి అనుష్క శెట్టి వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. ఇటీవలే ఒక భారతీయ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తను ఖండించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే.. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌తో స్వీటీ డేటింగ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
2014లో ప్రముఖ బాలీవుడ్ రచయిత కనికా ధిల్లాన్‌ను వివాహం చేసుకున్నాడు ప్రకాశ్. రెండేళ్ల క్రితం వారు విడిపోయారు. ఈ క్రమంలో స్వీటీ-ప్రకాశ్ కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతున్నారని.. తాజాగా పెళ్లికి సిద్ధమయ్యారని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది.