జీవించి ఉన్నంత కాలం నటిస్తానని చెబుతోంది నటి, టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ. ప్రసవించిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్లో పాల్గొంటానని తెలిపింది. సెట్స్‌లో ఉంటేనే తాను సంతోషంగా ఉండగలనని వెల్లడించింది. ఓ తల్లిగా, నటిగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొంది.
"సెట్స్‌లో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. రానున్న రోజుల్లో వరుసగా చిత్రీకరణల్లో పాల్గొంటాను. నా మొదటి బిడ్డ పుట్టిన వెంటనే నేను సెట్స్‌లో అడుగుపెడతాను. నా ఇల్లు, నా బిడ్డ, నా వృత్తి పట్ల నా బాధ్యతను సమంగా నెరవేరుస్తాను. నేను బతికి ఉన్నంతకాలం నటిస్తూనే ఉంటాను. ఎందుకంటే.. నటిస్తేనే నేను సంతోషంగా ఉండగలను"