కరోనా ప్రపంచమంతా వ్యాపిస్తున్న క్రమంలో కుక్కల ద్వారా వైరస్ సంక్రమిస్తుందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. దీంతో చాలా మంది వారి పెంపుడు జంతువులను బయట వదిలేస్తున్నారు. ఈ చర్యలపై స్పందించింది బాలీవుడ్ నటి అనుష్కశర్మ. పెంపుడు జంతువులను వదిలి వేయవద్దని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె కోరింది.
"ఈ సమయంలో తమ పెంపుడు జంతువులను విడిచి పెట్టవద్దని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నా. దయచేసి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. వాటిని మీతో భద్రంగా ఉంచండి. బయట వదిలివేయడమనేది అమానవీయమైన చర్య".
- అనుష్కశర్మ, బాలీవుడ్ కథానాయిక