Anushka Sharma News: బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా కొనసాగిన హీరోయిన్ అనుష్క శర్మ కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది. కొత్త ఏడాది నుంచి ఆమె తిరిగి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెండు భారీ చిత్రాలతో పాటు ఓ ఓటీటీ చిత్రంలోనూ నటించనున్నట్లు సమాచారం.
"ఇక అనుష్క అభిమానులకు పండగే. రెండు భారీ బడ్జెట్ సినిమాలతో పాటు ప్రముఖ ఓటీటీ సంస్థ కోసమూ నటించనుంది. వీటికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వస్తుంది. కచ్చితంగా అనుష్క మళ్లీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించడం ఖాయం" అని అనుష్క సన్నిహిత వర్గాలు చెప్పాయి.
నటనకు దూరంగా ఉన్నా నిర్మాతగా బిజీగానే ఉంది అనుష్క. 2020లో 'పాతాళ్ లోక్' వెబ్‌సిరీస్‌తో పాటు ‘బుల్‌బుల్’ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం మరో రెండు చిత్రాలను నిర్మిస్తోంది అనుష్క.