స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'నిశ్శబ్దం'. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. టీజర్‌ను వచ్చే నెలలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలనే ఆలోచనతో ఉన్నారు.
సంక్రాంతికి 'నిశ్శబ్దం'గా వస్తున్న స్వీటీ - అనుష్క
హీరోయిన్ అనుష్కశెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న 'నిశ్శబ్దం'ను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తోంది చిత్రబృందం. టీజర్ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరోయిన్ అనుష్కశెట్టి
ఇందులో కళా ప్రేమికురాలి(ఆర్ట్ లవర్)గా కనిపించనుంది అనుష్క. ఇతర పాత్రల్లో మాధవన్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడిసన్, సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తదితరులు నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది.
ఇది చదవండి: చిరంజీవి సినిమాలోని సీన్ నాని చిత్రంలో కాపీ!
Last Updated : Sep 28, 2019, 7:32 AM IST