'బాహుబలి' సిరీస్ తర్వాత హీరోయిన్ అనుష్క.. కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 'భాగమతి'తో మరో విజయాన్ని అందుకున్నా.. 'నిశ్శబ్దం' చేయడానికి దాదాపు ఏడాదిన్నరకు పైగా సమయం తీసుకుంది. ఈ సినిమా ముందు వరకు ఆ చిత్ర దర్శకుడు అశోక్ ఖాతాలో వరుస ఫ్లాప్‌లు ఉన్నా.. కథను నమ్మి ఆయనకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మరోసారి అలాంటి సాహసమే చేయనుందని టాక్.
ఫ్లాప్ దర్శకుడితో అనుష్క కొత్త సినిమా - అనుష్క నిశబ్ధం
హీరోయిన్ అనుష్క.. మరోసారి సాహసం చేసేందుకు సిద్ధమవుతుంది. తన కొత్త సినిమా కోసం యువ దర్శకుడు మహేశ్‌తో కలిసి పనిచేయనుందని టాక్ వినిపిస్తోంది.
ఫ్లాప్ దర్శకుడితో అనుష్క కొత్త సినిమా
'రా రా కృష్ణయ్య' అనే సినిమా తీసిన దర్శకుడు మహేశ్ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాడు. అనుష్కతో తర్వాత సినిమా ఇతడే చేయనున్నాడని టాక్. అందుకోసం నాయికా ప్రాధాన్య కథను సిద్ధం చేశాడట. ఇప్పటికే చర్చలు జరిగాయని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది.
ఇదీ చదవండి:బిగ్‌బాస్-4 హోస్ట్‌గా మహేశ్ బాబు?