తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గోపీచంద్​-అనుష్క ముచ్చటగా మూడోసారి? - anushka in gopichand movie

కథానాయకుడు గోపీచంద్ కొత్త సినిమాలో స్వీటీ అనుష్క హీరోయిన్​గా నటించనుందట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే?

anushka
గోపీచంద్​-అనుష్క?

By

Published : Oct 17, 2020, 9:34 PM IST

హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న గోపీచంద్‌, అనుష్క శెట్టి.. 'లక్ష్యం', 'శౌర్యం'లో కలిసి నటించారు. ఇప్పుడు మూడోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారట. ప్రముఖ దర్శకుడు తేజ.. గోపీచంద్​తో 'అలిమేలుమంగ వేంకటరమణ' చిత్రాన్ని తీస్తున్నారు. ఇందులో హీరోయిన్​గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారంటూ గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ స్థానంలోనే అనుష్కను తీసుకోనున్నారని సమాచారం.

దీని గురించే చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే స్పష్టత రావచ్చని సమాచారం. మరి అనుష్క ఓకే చెప్తుందా, లేదా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

అనుష్క 'నిశ్శబ్దం'తో ఇటీవలే అభిమానుల ముందుకొచ్చింది. మరోవైపు గోపీచంద్‌ 'సీటీమార్‌'తో బిజీగా ఉన్నారు. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. కబడ్డీ నేపథ్య కథతో రూపొందిస్తున్నారు.

ఇదీ చూడండి కరోనా బారిన పడ్డ రాజశేఖర్ కుటుంబం

ABOUT THE AUTHOR

...view details