'బాహుబలి'లో దేవసేనగా నటించి ప్రేక్షకులందరినీ తనవైపు తిప్పుకున్న నటి అనుష్క శెట్టి.. త్వరలోనే ఓ కొత్త చిత్రం చేయనుందని సమాచారం. ఈ సినిమాకు గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించనున్నాడట. కథ మొత్తం మహిళా ప్రధానంగా నడుస్తుందట. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రచయిత గోవింద్ నిహ్లాని రాసిన ఒక నవలకు ఇది అనుసరణగా ఉంటుందని తెలుస్తోంది.
గౌతమ్ మేనన్ దర్శకత్వంలో అనుష్క..! - telugu cinema news
ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మేనన్ దర్శకత్వంలో అనుష్క శెట్టి ఓ సినిమా చేయనుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం.
అనుష్క
ఈ చిత్రంలో తమిళ బిగ్‌బాస్ ఫేం అభిరామి వెంకటాచలం ఓ కీలక పాత్రలో నటించనుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అనుష్క ఇప్పటికే హేమంత్ మధుకర్ దర్శకత్వంలో వస్తున్న 'నిశ్శబ్దం' సినిమాలో మాధవన్‌తో కలిసి నటిస్తోంది.
ఇవీ చూడండి.. వినాయక్ సరసన సీనియర్ హీరోయిన్..!