బాలీవుడ్ కథానాయిక అనుష్క శర్మ మరికొన్ని నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. మన శరీరంలో మరో జీవితానికి ప్రాణం పోయడం అద్భుతమంటూ.. ఆనంద క్షణాల్ని ఆస్వాదిస్తోంది. పుట్టబోయే బిడ్డను ఊహిస్తూ మురిసిపోతోంది. ఈ సందర్భంగా తీసిన ఓ అపురూపమైన ఫొటోను అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
"నీలో మరో జీవితం ప్రాణం పోసుకోవడాన్ని ఆస్వాదించడానికంటే నిజమైంది, మధురమైంది మరొకటి ఉండదు. ఇది మన కంట్రోల్‌లో లేనప్పుడు ఇక ఏది ఉంటుంది..?" అని పోస్ట్ చేసింది. దీనికి ఆమె ప్రియమైన భర్త విరాట్ కోహ్లీ అందమైన కామెంట్ చేశాడు. నా మొత్తం ప్రపంచం ఒక్క ఫ్రేమ్‌లో ఉంది అంటూ హార్ట్ సింబల్ పోస్ట్ చేశాడు. అతడి మాటలు నెట్టింట్లో ఫాలోవర్స్ మనసులు దోచుకున్నాయి.