హీరోయిన్ అనుష్క శెట్టి నెటిజన్లతో తన భావోద్వేగాన్ని పంచుకుంది. తాను ఎంతగానో అభిమానించే అసిస్టెంట్రవి దూరం కావడం కలచివేసిందని ఇన్స్టాగ్రామ్లో వెల్లడించింది. రవి చనిపోయి ఏడాదైన సందర్భంగాఅనుష్క ఓ ఫొటోను పోస్ట్ చేసింది.
'నువ్వెప్పటికీ నా హృదయంలో ఉంటావు'
టాలీవుడ్ నటి అనుష్క శెట్టి భావోద్వేగంతో ఓ పోస్టు షేర్ చేసింది. తన అభిమాన అసిస్టెంట్ చనిపోయి ఏడాదైనా ఇప్పటికీ ఆ బాధను మరిచిపోలేకపోతున్నా అని పేర్కొంది.
"మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో , వారు మనల్ని వదిలి వెళితే ఆ బాధ వర్ణనాతీతం. 14 సంవత్సరాలు చాలా సాఫీగా ప్రయాణం సాగింది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఇక మీ జీవితంలో భాగం కాదని తెలిసినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. నీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. చనిపోయిన తర్వాత ఎలాంటి జీవితం ఉంటుందనే విషయం నాకు తెలియదు. కానీ నువ్వు ఎప్పుడూ నా హృదయంలో నిలిచి ఉంటావు"
---అనుష్క, నటి
భాగమతి చిత్రం తర్వాత మరో సినిమా చేయని అనుష్క శెట్టి త్వరలో 'సైలెన్స్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మాధవన్ ముఖ్య పాత్ర పోషించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందనుందని సమాచారం.